తెల్సా కథలపోటీకి మాకు దాదాపుగా 150 కథలు వచ్చాయి. చేతివ్రాతలో ఉన్నవీ, హామీపత్రం లేనివీ, ఫాంటు కారణంగా మేము చదవలేకపోయినవీ మినహాయించగా, 139 కథలు పోటీకి పరిశీలించాము. చేయి తిరిగిన రచయితలే కాక, తొలిప్రయత్నంచేసిన రచయితలతోసహా ఎంతోమంది ఆసక్తితో పాల్గొనడం సంతోషం. తెలుగులో పూర్తిగా ఎలక్ట్రానిక్‍గా జరిపిన కథలపోటీ ఇదే మొదటిది కావచ్చు. ఎలక్ట్రానిక్‍గా ఈమెయిల్‍ ద్వారా మాత్రమే రచనలు స్వీకరించడం వల్ల కొద్ది గంటలలోపే రచయితలకి వారి కథ మాకు చేరినట్లు తెలియచేయగలిగాము. కొందరు రచయితలు ఒకటికన్నా ఎక్కువ రచనలు పంపారు. కొందరు రచయితలు తమ కథలకి మార్పులు చేర్పులు చేసి, కొద్దిరోజుల తరువాత రెండవ ప్రతి పంపారు. యూనికోడు వర్డ్ ఫార్మాటులో పంపిన రచనలని మాత్రమే స్వీకరిస్తామని ప్రకటించినా, చాలా మంది రచయితలు యూనికోడు కాని ఇతర ఫాంటులో కూడా టైపు చేయించి పంపారు. అటువంటి రచనలు పీ.డీ.యఫ్ ఫార్మాటులో ఉంటే వాటిని కూడా పరిశీలించాము. మేము పరిశీలించలేని ప్రతి కథారచయితకీ వారి కథని ఎందుకు పరిశీలించలేమో స్పష్టంగా తెలియచేసాము. కొందరు రచయితలు తిరిగి యూనికోడులో టైపు చేయించి పంపారు. చాలా కథలమీద, ముఖ్యంగా నాటికలమీద టీవీ సీరియళ్ళ, సినిమాల ప్రభావం ప్రస్ఫుటంగా…