నేను వంటింట్లో పనిచేసుకుంటూ క్రీగంట గమనిస్తున్నాను. ఆవిడ తన బట్టలు మొత్తం బీరువాలోంచి తీసి సూట్ కేసులో సర్దేసుకుంటోంది. గత ఏడాదిగా ఆవిడ ఇంట్లో కట్టుకునే బట్టలు కొన్ని బీరువాలో వదిలేసివెళ్తోంది. యాహూ! నేనకున్నది నెరవేరింది. ఎగిరి గంతెయ్యాలన్పించింది. పక్కనే గట్టుమీద ఆన్‌చేసి పెట్టిన నా సెల్లో వస్తున్న హుషారైన పాటకి స్టెప్స్ వేస్తూ రెండు నిమిషాలు నాట్యం చేసాను. అసలిదంతా ఎక్కడ మొదలైందంటే– ఊరికోసం ఆ పనిచెయ్యాలి, ఈ పనిచెయ్యాలి అంటూ ఉండుండి సిటీకి వచ్చేస్తూ ఉంటుంది. అరవైదాటిన ఈ వయసులో కూడా ముసల్దానికి ఎంత ఓపికో! అన్నట్టు ముసలాళ్లని ముసలాళ్లనకూడదట కదా, పెద్దవాళ్లనాలట. గాడిద,గుడ్డేంకాదూ. వేళకి వండి వడ్డిస్తూంటే శుభ్రంగా తిని తిరుగుతూంటుంది. నేను చేసిన పొరపాటేంటంటే మా అమ్మకి వీవర్స్ పోయింట్లో చీరలు కొన్నప్పుడల్లా ఆవిడకీ కొనడం. ఎందుకిన్ని చీరలు, డబ్బు వేస్ట్ చెయ్యకమ్మా అంటూనే సింగారించేస్తుంది. పదేసి వేలుపోసి నేను కొనుక్కునే డ్రెస్సులూ, పిల్లలకి కొనే కాస్ట్లీ బట్టలు పల్లెటూళ్లో ఏనాడూ చూసి ఉండదేమో “బట్టలు ఇంతంత ఖరీదా?” అని నోరెళ్లబెడుతుంది. అక్కడికి ఆవిడ సొంతసొమ్మేదో మేం ఖర్చుపెట్టేస్తున్నట్టు. చందు సంపాదిస్తున్నాడు. నేనూ, పిల్లలూ ఎంజాయ్ చేస్తున్నాం. అదేం చిత్రమో,…