పూడూరి రాజిరెడ్డి: సొంత ఊరు ఒకప్పటి కరీంనగర్ జిల్లా వేములవాడ దగ్గరి నర్సింగాపురం. బీయెస్సీ పూర్తి చేసిన తరువాత కొన్నాళ్ళు ఈనాడు దినపత్రికలో పనిచేశారు. సాక్షి దినపత్రిక మొదలైనప్పటినించీ అందులో పనిచేస్తున్నారు. ఇప్పుడు సాక్షిలో సాహిత్యం శీర్షిక నిర్వహిస్తున్నారు. 2009 లో “మధుపం: ఒక మగవాడి ఫీలింగ్స్”, అన్న పుస్తకాన్నీ, 2013 లో కొన్ని సమూహాలు, కొన్ని ప్రదేశాల అనుభవాలను “రియాలిటీ చెక్” అన్న పేరుతో పుస్తకంగా వెలువరించారు. 2017లో “చింతకింది మల్లయ్య ముచ్చట” అనే కథల సంపుటి వెలువరించారు. త్వరలో “ఆజన్మం” అనే కథల సంపుటి ప్రచురించబోతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. ఎప్పటికైనా సొంతఊరికి వెళ్ళి క్షేత్ర వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం కూడా చేయాలని ఉంది. మొదటి బహుమతి పొందిన వీరి కథ కొండ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి: స్టార్ మా తెలుగు చానెల్లో రచయితగా పనిచేస్తున్నారు. ఈటీవీ కన్నడవాహినిలో పనిచేసినప్పుడు కన్నడంలో కూడా రచనలు చేశారు. ముప్ఫై కథలకి వివిధ పోటీల్లో బహుమతులు పొందారు. వలసదేవర నవలకి గాను అమెరికన్ తెలుగు అసోసియేషన్వారి తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందారు. త్వరలో “నూటొకటో మార్కు” అనే కథాసంపుటం ప్రచురించబోతున్నారు.రచయిత కాకముందూ, తరవాతా…