జన్మతః తెల్సావైనట్టి సాహితీలక్ష్యాలు సాధించడంలో తెల్సా కథ, నాటికల పోటీ ఒకటి. తెల్సాకి ముఖ్యమైన యితర లక్ష్యాలున్నాయ్. వాటి గురించి మరొకచోట ప్రస్తావించాను. 1997 లో లాసేంజలస్లో తానా (TANA) సభలప్పుడు అమెరికానుండి మొట్టమొదటిసారిగా నవలల పోటీ పెట్టడంతో ఆరంభించి, 1999-2003 మధ్య అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారి ద్వైమాసిక పత్రిక “అమెరికా భారతి” సంపాదక వర్గంగానూ, 2006 లో లాసేంజలస్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలప్పుడు కథలు, కవితలు, నవలలు, నాటకాలు అన్నింటా పలుమార్లు పోటీలు నడిపించి, బహుమతులు ఇచ్చి, వాటిని “కబురు”లో ప్రచురించి ప్రోత్సహించడం, ఇప్పుడు తెల్సా నిర్వాహకులుగా కథ, నాటకరచనలలో పోటీ పెట్టి రచయితలకు మరో అవకాశం యివ్వడం వరకూ తెల్సా బృందానికి పాత్ర, అనుభవం ఉన్నాయి. అయితే ఇతఃపూర్వం నడిపించిన పోటీలన్నింటా మధ్యవర్తులుగా మాకు వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలు సహకరించాయి. ఈ సారి పోటీప్రకటన ముద్రించడం వరకు మాత్రమే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సారంగ వెబ్పత్రిక వారి సహకారం కోరాం. సాంఘికమాధ్యమాలు కల్పించిన అవకాశం ఈ మార్పుకు దోహదం చేసింది. ఎప్పటికప్పుడు రచయితలకు సమాచారం అందించడం, వచ్చిన రచనలు తొందరగా పరిశీలించడం, ఎన్నికైన రచనల గూర్చిన సమాచారం ఆయా…